బాన్సువాడ లో టిఆర్ఎస్ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమాలు.

 కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని రోడ్ ఎక్కిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు

బాన్సువాడ లో టిఆర్ఎస్ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమాలు.

 

 

బాన్సువాడ: బాన్సువాడ మండల కేంద్రంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యం లో నిర్వహించారు. అంత కు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ, గార్కే  నల్లధసు ధరించి నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు భారత రాష్ట్ర సమితి నాయకులు ధరించి నిరసన వ్యక్తం చేస్తే అభ్యంతరం ఏమిటని ప్రజాస్వామ్యంలో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని మోరీలు శ్రీనివాసరావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడంతోనే భారత రాష్ట్ర సమితి కెసిఆర్ ఆదేశాల మేరకు హామీలను అమలు చేయాలని కోరిన మహిళ ఎమ్మెల్యే లను పోలీసులు దురుసుగా ఈడ్చికేల్లడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి నాయకులు జుబేర్, అంజిరెడ్డి, మోచి గణేష్, కౌన్సిలర్లు సలీం, మాజీ కౌన్సిలర్ బాడీ శీను, అక్బర్, శివ, రమేష్ యాదవ్, మహిళలు నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News