బాన్సువాడ కోటాలో బి ఆర్ ఎస్ సమరభేరి.

బాన్సువాడ కోటాలో బి ఆర్ ఎస్ సమరభేరి.

  •  ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. 
  • పోచారం గ్రామంలో పోచారం గ్రామ అభివృద్ధిని విస్మరించారు.
  • మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.

బాన్సువాడ : కోటలో బీఆర్‌ఎస్‌ సమర భేరి ప్రజా పాలన లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం పోచారం గ్రామాభివృద్ధిని విస్మరించారు: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రాష్ట్రంలో ప్రజాపాలన అందించడం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి గ్రామాభివృద్ధి ని విస్మరించి, తన అనుచరుల అభివృద్ధి కే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సోమవారం నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యం లో నిర్వహించిన ‘సమరభేరి’, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం పై నిరసన కార్యక్రమం లో బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన పార్టీ నాయకుల తో కలిసి గ్రామం లోని మురుగు నీటి కాలువలు, శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనం, నర్సరీ ని పరిశీలించారు. శిథిల భవనం లో పంచాయతీ పాలన ఎలా? నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనం ప్రమాదకర స్థితికి చేరిందని బాజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి లో పంచాయతీ సిబ్బంది భయాందోళన ల మధ్య విధులు నిర్వహిస్తున్నార ని అన్నారు. సిబ్బంది ప్రాణాల కు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తార ని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గతంలో నిధులు మంజూరై నప్పటి కీ నిర్మాణం జరగకపోవడం బాధాకరమన్నారు. సర్పంచ్‌ తమకు అనుకూలం గా లేరనే కారణంతో గ్రామా భివృద్ధికి రావాల్సిన నిధులను అడ్డుకోవడం సరి కాదని విమర్శించారు. కే సీ ఆర్‌ పాలన లో అభివృద్ధి జరిగింద ని కేసీఆర్‌ ప్రభుత్వ హయాం లో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని బాజిరెడ్డి అన్నారు. వైకుంఠ ధామాలు, నర్సరీలు, మొక్కల పెంపకం, మురుగు నీటి కాలువలు, రోడ్లు తదితర సౌకర్యాల ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్వహణ, మరమ్మతుల పై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలన లో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించింద ని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందని, అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీ ఆర్‌ ఎస్‌ దే పూర్వ వైభవం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని బాజిరెడ్డి గోవర్ధన్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజా సమస్యల ను ఎత్తి చూపాల ని పిలుపు నిచ్చారు.
పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.
బీ ఆర్‌ ఎస్‌ సీనియర్  నాయకుడు మోరల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల ను పూర్తిస్థాయి లో అమలు చేయ లేద ని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయమే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పని చేయాల ని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు నర్సింలు గౌడ్‌, టేకుర్ల సాయిలు, మెగావత్ భాస్కర్, అక్తర్‌, కృష్ణ, భూమయ్య, రాము, మోసిన బాబు లక్ష్మణ్, భాస్కర్,  అల్లం గంగారం, సుంచు శేఖర్, నాగరాజు, గంపల శంకర్, వెంకట్ సార్, వివిధ మండల పార్టీ సీనియర్‌ నాయకులు మోచి గణేష్, ఎజాజ్, గాండ్ల మధు, గోపిరెడ్డి, కిషన్ సార్, నవీన్, తెల్ల రవి,  అఖిమ్, బాలకృష్ణ, సంజీవ్,  పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-07 at 12.44.35 PM

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం   పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం  
పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం  పాపన్నపేట,  : మండల కేంద్రమైన పాపన్నపేటలో పద్మశాలీ కులసంఘం  ఆధ్వర్యంలో ఆఖరి శ్రావణ...
క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు
ఎమ్మార్వోను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి: డీఎస్పీ ప్రసన్నకుమార్
కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి.
బాన్సువాడ ఆర్ డి ఓ వినతి పత్రం సమర్పించిన బి ఆర్ ఎస్ నాయకులు.
బాన్సువాడ కోటాలో బి ఆర్ ఎస్ సమరభేరి.