డప్పులతో కాంగ్రెస్ దూకుడు.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

డప్పులతో కాంగ్రెస్ దూకుడు.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

  • పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తంగా మారిన ఎర్రవల్లి శివారు
  • దామరగుంట వద్ద కాంగ్రెస్ నేతల బి ఆర్ ఎస్ నేతల వాగ్వాదం 

సంగారెడ్డి డెస్క్ విజన్ ఆంధ్ర, సెప్టెంబర్ 8:-ఎర్రవల్లి గ్రామ శివారులో రాజకీయ రగడ తారస్థాయికి చేరింది. కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు కాంగ్రెస్ శ్రేణులు భారీగా డప్పులతో, నినాదాలతో దూసుకెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలతో ఎర్రవల్లి పరిసరాలు దద్దరిల్లాయి. ఇరు వర్గాల కార్యకర్తలు ఎదురెదురుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దామరగుంట వద్ద ఫామ్‌హౌస్‌కు వస్తున్న కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తతను మరింత పెంచింది. ఘటనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News