ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దారుణం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండించిన చర్ల బి ఆర్ ఎస్ యువజన నాయకులు
చర్ల,(భద్రాద్రి కొత్తగూడెం) : అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డు కోవడం, వారిపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ యువజన నాయకులు కాకి అనిల్, అంబోజి సతీష్ తీవ్రంగా ఖండించారు, సోమవారం జరిగిన ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న బీఆర్ఎస్ నేతలను అణచివేసే ప్రయత్నంలో భాగంగా, కనీసం మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా చీరలు లాగడం, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. కేటీఆర్, హరీష్‌రావుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అధికార పక్షం ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి, ఆ నేతను ఎదుర్కొనే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసలు నైతికత లేని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, వార్డు సభ్యుడిగా కూడా గెలవని సీఎం సోదరుడికి నలుగురు గన్‌మెన్లను కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు, వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు, 420 హామీలు వెయ్యి రోజులు గడుస్తున్నా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యువజన నాయకులు అంబోజు సతీష్, కాకి అనిల్ లు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


