ఉద్యోగానికి ఎంపికైన యువకులకు అభినందనలు
కుల్కచర్ల, వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి ఈ నెల 3వ తేదిన విడుదల చేసింది. ఇందులో డ్రైవర్ ఉద్యోగానికి బండవెల్కిచర్ల, కుల్కచర్ల గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికైనారు. ఈ సందర్భంగా బండవెల్కిచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో పాంబండ ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బండవెల్కిచర్ల సర్పంచి శ్రీనివాస్ లు కలిసి యువకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.తమ ప్రాంతానికి చెందిన యువత ఉద్యోగ సాధనలో రాణిస్తున్నారని చెప్పారు. వీరిని ఇతరులు ఆదర్శంగా తీసుకుని లక్ష్య సాధనలో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బండవెల్కిచర్ల ఉప సర్పంచి గోవర్ధన్ రెడ్డి, స్థానికులు,పాల్గొన్నారు.
Views: 74
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
