తర్నీకల్ తండలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం

110 మంది అనుమానిత టీబీ రోగులకు చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు

WhatsApp Image 2026-01-20 at 3.11.21 PM

 

కల్వకుర్తి  : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తోటపల్లి పరిధిలోని తర్నికల్ ఉపకేంద్రం, తర్నీకల్ తండలో సోమవారం భవిష్యభారత్ ఎన్‌జీఓ భాగస్వామ్యంతో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 110 మంది అనుమానిత టీబీ వ్యాధిగ్రస్తులకు చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలతో పాటు రక్తపోటు (బీపీ), షుగర్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తొలిదశలోనే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ముఖ్యంగా టీబీ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా పూర్తి స్థాయిలో నివారణ సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాసులు, ఎంపీ హెచ్ ఈ ఓ ప్రసాద్, ఎం పి హెచ్ ఎస్ శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ రాధ, ఎస్ టి ఎస్ గౌరీకుమార్, ఎంఎల్ హెచ్పి శశికళ, ల్యాబ్ టెక్నీషియన్ సత్యం, ఏఎన్ఎం రాములమ్మ, ఫర్వీన్, ఆశ వర్కర్లు, అలాగే భవిష్యభారత్ ఎన్‌జీఓ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget