వచ్చేది కెసిఆర్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
తెలకపల్లి, :రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ బి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు తెలకపల్లి లో సోమవారం రైతుల ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు నెహ్రూ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2500 ఇవ్వాలని తహసిల్దార్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ హనుమంత్ రావు, మాజీ ఎంపిటిసి రమేష్ ,బిఆర్ఎస్ నాయకులు శివ ,మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


