ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి: డీఎస్పీ ప్రసన్నకుమార్
పాపన్నపేట,:గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. పాపన్నపేటలోని మంజీరా ఫంక్షన్ హాల్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ గణేష్ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రజలు, గణేష్ మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గణపతి మండలి సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


