22ఏతో వేల ఎకరాలు బ్లాక్ - పేదల ఉసురు పోసుకున్న రేవంత్ సర్కార్
రెవెన్యూ మంత్రి పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలి : గంగుల కమలాకర్ డిమాండ్
కరీంనగర్ : రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేదల ఉసురు పోసుకుంటోందని, ఈఅరాచకాలకు నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వచ్చాక ఊర్లకు ఊర్లే 22ఏలోకి వెళ్లిపోయాయని, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడేందుకు తెచ్చిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతల ఒత్తిడితో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పట్టాదారులకు నోటీసులు కూడా ఇవ్వకుండా వేలాది ప్లాట్లను బ్లాక్ చేశారని మండిపడ్డారు. రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లిలో మున్సిపల్ అనుమతులతో ఇళ్లు కట్టుకున్న వారు కూడా అమ్ముకోలేక విద్య, వైద్యం, పెళ్లిళ్లకు డబ్బులు లేక రోడ్డున పడ్డారని, వెంటనే అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ నుంచితొలగించకపోతే చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు, భూ బాధితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 17:42:08
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
