ఎమ్మార్వోను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మందమర్రి, (మంచిర్యాల): ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విధులు ముగించుకొని క్యాతన్ పల్లి ఇంటికి వెళ్తున్న మందమర్రి ఎమ్మార్వోను కారులో వెంబడించిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఇంటికి వెళ్ళిన అనంతరం శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే కారు వెంబడించినట్లు ఎమ్మార్వో సతీష్ కుమార్ శర్మ చెప్తున్నారు. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మందమర్రి ప్రాంతానికి చెందిన వ్యక్తితో పాటు క్యాతన్ పల్లికి చెందిన మరొకరు కారులో ఉన్నట్లు తెలిపారు. సంబంధించిన ఫిర్యాదును పరిశీలించిన ఆర్కేపీ ఎస్సై జాడి శ్రీధర్ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


