సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న వారు రోడ్డు ప్రమాదం లో మరణించారని అలాగే ఇదివరకు ఎన్నో ప్రమాదం జరిగి వారు కూడా ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందిస్తారు తప్ప ఆ తర్వాత మరిచిపోతారని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్ మహిళా పాలిటెక్నిక్ ఆర్టీవో ఆఫీస్ ఫిషరీ కళాశాల విద్యార్థులు తరచూ ఈ రోడ్డుపై వెళ్తుంటానని సర్వీస్ రోడ్ లేక రోడ్డు దాటాలన్న నేషనల్ హైవే లో సాహసంతో కూడినదని అతివేగంగా వాహనాలు అటు ఇటు వెళుతుంటాయని ఈ సమయంలో రహదారి దాటాలన్న వ్యయ ప్రయాసలు కోర్చి రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బజారు బాలకృష్ణతోపాటు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయరని , ఆలనా పాలన కరువై నట్లు డబుల్ బెడ్ రూమ్ వాసులు
పేర్కొన్నారు.
పేర్కొన్నారు. Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
