వనమహోత్సవంలో మొక్కలు నాటిన మేయర్, కమిషనర్

వనమహోత్సవంలో మొక్కలు నాటిన మేయర్, కమిషనర్

కొత్తగూడెం  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం–2026లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్‌లోని రామచంద్ర పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత మొక్కలు నాటారు. పలువురు డివిజన్ కార్పొరేటర్లు సైతం పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “ప్రతి ఇంటా ఒక మొక్క.. ప్రతి ఊరు పచ్చని వనం” అనే లక్ష్యంతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు నాటిన మొక్కలే రేపటి తరాలకు జీవనాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు.“మొక్కని నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆమె కోరారు.

Views: 77

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు