గౌరవెల్లిని పూర్తి చేసి హుస్నాబాద్ ని సస్యశ్యామలం చేస్తాం మంత్రి పోన్నం ప్రభాకర్
సిద్దిపేట : గౌరవెల్లి పూర్తి చేసి హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తానని,భూసేకరణ వేగవంతం.. రూ.250 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి పో న్నం ప్రభాకర్ తెలిపారు.కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. ఆయిల్ ఫామ్ సాగుతో అత్యధిక లాభాలు ఉన్నాయని,రైతులు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని,వర్షపు నీటిని ఒడిసిపట్టడమే ప్రధాన లక్ష్యంమని అన్నారు. సోమవారం రోజున కొండాపూర్ గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్ర మంలో పాల్గొన్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే, భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను మంత్రి స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల,డీపీవో జగదీశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ మర్క రాజ్‌కుమార్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 17:42:08
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
