చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు

చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు


వనపర్తి : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన 98 జీఓను తక్షణమే అమలు చేసి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిం చారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించా లని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు.98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్క రించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామస్వామి పాల్గొని నిర్వాసి తులనుంచి దరఖాస్తులు స్వీకరించారు.పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News