ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి

ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి

మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని నివేదించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ సూచనల మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, అదే విధానాన్ని రాజకీయ రంగంలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దళిత జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరుతాయని, సామాజిక న్యాయం, సమానత్వం మరియు బలహీన వర్గాల సాధికారత లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు మిట్టమిది నాగరాజు, ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకుడు దళితరత్న ఎడ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 
Views: 81

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget