వన మహోత్సవంతోనే పర్యావరణ రక్షణ
ఫత్లాపూర్ పంచాయతీలో మొక్కలు నాటిన ఏఈఓ మాధవిగారు, ప్రజాప్రతినిధులు
బిచ్కుంద: పర్యావరణ పరిరక్షణ, గ్రామంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ మాధవి గారు, సర్పంచ్ పద్మిని మారుతీ, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, జీపీవో కాశినాథ్ మరియు గ్రామ యువకులు యాదవ్ రావు, ఖుద్దూస్, రవీందర్, రాజు గౌడ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, గ్రామంలో పచ్చదనం పరిఢవిల్లేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాటిని సంరక్షించాల ని పిలుపునిచ్చారు.
Views: 46
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Aug 2026 18:24:47
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
