ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం.
తెరుచుకోని హాస్పిటల్‌
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 
డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు

పరకాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు  గాజుల నిరంజన్* ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు, SIR హనుమకొండ జిల్లా ప్రముఖ్ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సిరంగి సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ దేశ,రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పరకాలలో ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆసుపత్రి ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరిందని ఆరోపించారు.ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితిని ప్రజలు స్వయంగా సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని కోరారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాల్సి ఉండగా, పలువురు నాయకులను అరెస్టు చేసి కార్యక్రమం నిర్వహించడం సరికాదని ఆరోపించారు. ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ఆధారంగా పాలన సాగిస్తోందని విమర్శించిన కాళీప్రసాద్‌రావు, హైదరాబాద్ భూములపై కన్నేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22-A నిబంధనల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెల్లడించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పరకాలకు వచ్చిన ముఖ్యమంత్రి ఏ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి ప్రారంభించాల్సి ఉండగా, నాయకులను అరెస్టు చేసి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఫీజుల బకాయి – బీజేపీ లడాయి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు 
శ్రీ ఎన్. రాంచందర్‌రావు* హైదరాబాద్‌లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు సంఘీభావంగా బీజేపీ పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.  ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఫీజుల బకాయి – బీజేపీ లడాయి- విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరుబాట - కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ఈ కార్యశాలలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంతిలాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్, పరకాల మాజీ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, నాగారం మాజీ సర్పంచ్ బాబన్న, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి ఉడత చిరంజీవి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి కిరణ్, పరకాల పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, దంచనాదుల సత్యనారాయణ, ఓబీసీ పరకాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పైండ్ల రంజిత్, గుడిగంటి రఘుపతి గౌడ్, ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామునూరు శ్రీనివాస్, ఆత్మకూరు మాజీ అధ్యక్షులు ఇరుసాల సదానందం, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దంచనాదుల కిరణ్, భయపడి రవ్వ శివప్రసాద్, సూరచందర్, గుండు ముఖేష్, గుండెబోయిన నరసయ్య, జంగిలి రాజేందర్‌రావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– భారతీయ జనతా పార్టీ, పరకాల
 
 
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు