పంచాయతీ కార్మికుల ఉసురు తీస్తారా?
వెంటనే పర్మినెంట్ చేయాలి - సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఫైర్
కరీంనగర్, : జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తూ వారి ఉసురు తీస్తారా? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.పల్లెసీమల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజలకు అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులందరినీ రెండవ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు.రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులందరికీ ప్రతి నెల ఒకటో తారీకున అకౌంట్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. వయసు పైబడి, అనారోగ్యం పాలై మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేసి పర్మినెంట్ చేయాలన్నారు.గ్రామాల్లో కొందరు సర్పంచులు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికులను తొలగిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు కనీసం తక్షణ సహాయం రూ.30 వేలు అందించాలని, గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికుల్లో నూటికి 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారే పని చేస్తున్నారని, వీరి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్కార్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డి. నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Aug 2026 18:24:47
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
