మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి / గణపురం : చెల్పూర్ శివారులో ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థుల కొరకు నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవన నిర్మాణ పనులను భూపాలపల్లి శాసనసభ్యులు  గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నిర్మాణంలో ఉన్న ప్రతి గదిని సందర్శిస్తూ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ హాస్టల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.సుమారు 242 మంది విద్యార్థుల వసతి సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ హాస్టల్ భవనాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.భవన నిర్మాణం పూర్తైన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే  తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్  బుర్ర కొమురయ్య గౌడ్,వైస్ చైర్మన్  అంబాల శ్రీనివాస్,మెడికల్ కాలేజీ  ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News