పెబ్బేరు బస్టాండులో సీసీ బెడ్ పనులు ప్రారంభం
పెబ్బేరు : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రయాణికుల కష్టాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోగా రూ, 39 లక్షల 67 వేలతో సీసీ బెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని,మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, జములమ్మ, శివసాయి, భాగ్యలక్ష్మి శివ, వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, డిప్యూటీ ఇంజనీర్ జంగయ్య, ఏఈ సంపత్ కుమార్, కాంట్రాక్టర్ కృష్ణ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు._
Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
