పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
మల్లంపల్లి, : మల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 9న బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎం.డి. రహ్ముద్దీన్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించాల్సి ఉండటంతో ఈ ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెప్టెంబర్ 8 సాయంత్రంలోపు మండల కార్యాలయ ఈ-మెయిల్‌కు పంపించాలని ఆదేశించారు. సమావేశం రోజున అవసరమైన జిరాక్స్ ప్రతులను సమర్పించడంతో పాటు, తమ శాఖకు సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని ఎంపీడీవో ఎం.డి. రహ్ముద్దీన్ కోరారు. సమావేశంలో మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల వారీగా చేపడుతున్న పనులు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


