రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి

అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా చర్యలు : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి

 

 

నిర్మల్ జిల్లా,: జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, యువత, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకురుణాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు, ప్రాధాన్యతా రంగాలకు ఆర్థిక సహాయం, సామాజిక భద్రతా పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని బ్యాంకులకు రూ.7,952.87 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.2,331.18 కోట్లు (29.31 శాతం) సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన రూ.6,661.73 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,847.71 కోట్లు (27.74 శాతం) సాధించారని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యా రుణాల మంజూరు తక్కువగా ఉందని పేర్కొన్న కలెక్టర్, అర్హులైన విద్యార్థులకు అధిక సంఖ్యలో రుణాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని ప్రతి ఒక్కరికీ సెప్టెంబర్‌లోగా ఖాతాలు తెరవాలని సూచించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కాస్మోటిక్ ఛార్జీల జమ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 3,500 ఖాతాల్లో ఇప్పటికే 1,022 కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు తెలిపారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ తదితర పథకాల అమలును కలెక్టర్ సమీక్షించారు. రుణ లక్ష్యాల సాధనకు జిల్లా పరిశ్రమల శాఖ బ్యాంకర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ, పీఎం స్వనిధి రుణాల్లో ఎన్‌పీఏలను తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించాలని ఎల్‌డీఎంను సూచించారు. మొండి బకాయిల వసూళ్లకు సీబీఆర్‌ఎం బృందాల సేవలను వినియోగించుకోవాలని, అన్ని బ్యాంకులను సమన్వయం చేస్తూ మెరుగైన పనితీరు సాధించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు డిజిటల్ ఎంసీపీ సమస్యలను పరిష్కరించాలని పీడీ డీఆర్‌డీఏకు సూచించారు. విజయ డెయిరీతో టైఅప్ ద్వారా రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పాడి పశువులకు అవసరమైన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని జిల్లా పశువైద్యాధికారిని ఆదేశించారు. డెయిరీ యూనిట్లకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రైస్ మిల్లుల ఫైనాన్స్‌కు అవసరమైన ఎన్‌ఓసీలు, బ్యాంకు గ్యారెంటీల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై వంటి సామాజిక భద్రతా పథకాల కింద మరణించిన లబ్ధిదారుల కుటుంబాలకు అందిన క్లెయిమ్‌లను విజయగాథలుగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం జిల్లాలోని క్రెడిట్ పోర్ట్‌ఫోలియోపై ఎలా ఉండొచ్చో అంచనా వేసి నివేదిక అందించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం బి. రామ్‌గోపాల్, ఆర్‌బీఐ ఏజీఎం, ఎల్‌బీఓ ఎస్. రాములు, పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, ఆర్‌ఎం నవీన్ పురం, సీఎం క్రెడిట్ ఆర్‌బీఓ ఆదిలాబాద్ పియూష్, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

WhatsApp Image 2026-09-08 at 4.07.20 PM (1)

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: