పేద కుటుంబ వివాహానికి కార్పొరేటర్ గుండా సంతోష్ ఆర్థిక చేయూత
మహబూబ్‌నగర్ : పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ మరోసారి తన సేవాదృక్పథాన్ని చాటుకున్నారు. 21వ డివిజన్ పరిధిలోని ఊరగుట్ట ప్రాంతానికి చెందిన రఘురాములు–వరలక్ష్మి దంపతుల కుమార్తె వరలక్ష్మి వివాహం సందర్భంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.21,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వివాహ కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ గుండా సంతోష్ నూతన వధూవరులను ఆశీర్వదించి, రూ.21,000లను వివాహ కానుకగాఅందించారు. పేద కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆర్థిక సహాయం అందించినందుకు కుటుంబ సభ్యులు గుండా సంతోష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, బాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


