డ్యాన్సులకే పనికొస్తాడు.. ఎమ్మెల్యేగా మాత్రం పనికిరాడు
- మల్లారెడ్డిపై తోటకూర అజయ్‌యాదవ్ ఘాటు వ్యాఖ్యలు
- కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో బోడుప్పల్‌కు భారీ అభివృద్ధి..
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
- స్టెప్పుల మల్లారెడ్డికి అజయ్ సవాల్.. ‘అభివృద్ధిపై ముఖాముఖికి రా!
బోడుప్పల్ : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోడుప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై బోడుప్పల్ నగర మాజీ మేయర్ తోటకూర అజయ్‌యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డ్యాన్సులు చేయడానికే మల్లారెడ్డి పనికొస్తారు.. ఎమ్మెల్యేగా మాత్రం పనికిరారు అంటూ అజయ్‌యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి బోడుప్పల్ అభివృద్ధికి ఏం చేశారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోడుప్పల్ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 1000 రోజుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని చెప్పారు. మల్లారెడ్డి పదేళ్ల పాలనలో బోడుప్పల్‌కు రూపాయి కూడా తేలేదని అజయ్‌యాదవ్ ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని చూసి ఓర్వలేక మల్లారెడ్డి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకురాలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి పనులు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు. డ్యాన్సులు, రాజకీయ ప్రదర్శనలు కాదు.. ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన పని ఏమిటో చెప్పాలని అన్నారు. మల్లారెడ్డి నిజంగా బోడుప్పల్ అభివృద్ధిపై మాట్లాడాలనుకుంటే బహిరంగ చర్చకు రావాలని అజయ్‌యాదవ్ సవాల్ విసిరారు.ఏ చౌరస్తాలోనైనా ముఖాముఖి చర్చకు నేను సిద్ధం. మీరు పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో మేము చెబుతాం. ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


