నూతన సీఐకి నడికూడ ప్రెస్ క్లబ్ సన్మానం..

- పోలీసులు, ప్రెస్‌ మిత్రులు సమన్వ యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.: సీఐ ప్రవీణ్‌ కుమార్.

నూతన సీఐకి నడికూడ ప్రెస్ క్లబ్ సన్మానం..

నడికూడ, : పరకాల సర్కిల్‌కు నూతనంగా వచ్చిన సీఐ. ప్రవీణ్‌కుమార్‌, అలాగే ఎస్ఐ. పవ న్ లను నడికూడ ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సీఐని గౌరవంగా ఆహ్వానించి శాలువాతో సత్క రించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భంగా సీఐ ప్రవీణ్‌ కుమార్ మాట్లాడు తూ.. నడికూడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను వెలుగు లోకి తీసుకు రావడంలో పాత్రికేయులు కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రెస్ మిత్రులు, పోలీసు శాఖ సమన్వ యంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటు లో ఉండాలని కోరారు. కార్యక్రమంలో నడికూడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, గౌరవాధ్యక్షులు బాలరాజు,ఉపాధ్యక్షులు విజయ్, చిరంజీవి, సంయుక్త కార్యదర్శు లు సుధీర్, అశోక్, కార్యవర్గ సభ్యులు తాళ్ళ రవి, చుక్క సతీష్, రాజేందర్, సభ్యులు పాల్గొన్నారు. 

Views: 167

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో