శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లుఇస్కాన్ టెంపుల్‌తో పాటు గోపాలకృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఇస్కాన్ టెంపుల్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిల తో కలిసి మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మున్సి పల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ , మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లుమాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తూ , పుర ప్రజలు సుఖసంత్శల్తో సుఖంగా ఉండాలని, మరొక్కసారి భగవంతుణ్ణి కోరామన్నారు.పంటలు సమృద్ధి గా పండాలని,వర్షాలు బాగా కురవాలని కోరారు.ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


