టీబీజీకేఎస్ సింగరేణి ఏరియాలకు నూతన ఇన్చార్జుల నియామకం
నస్పూర్, : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణిలోని వివిధ ఏరియాలకు నూతన ఇన్ఛార్జర్లను నియమించింది. సంఘ అధ్యక్షులు రాజిరెడ్డి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.నియామకాల వివరాలు:శ్రీరాంపూర్ ఏరియా ఇన్ఛార్జ్: రామమూర్తి.మందమర్రి,బెల్లంపల్లి ఏరియాల ఇన్ఛార్జ్: సురేందర్రెడ్డి.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు రాజిరెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జర్లు యూనియన్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, రాబోయే సంఘ ఎన్నికల్లో (టీబీజీకేఎస్) ను విజయపథంలో నడిపించేందుకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


