భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...

ఎన్టీఆర్ కాలనీలో కలకలం..!

భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...

  • వివాహేతర సంబంధం ఉందంటూ భార్య ఆరోపణలు..
  • ఇద్దరు పిల్లలతో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆవేదన..
  • ఆరు సంవత్సరాలుగా సంబంధం కొనసాగుతోందని ఆరోపణ..
  • ఒకే గదిలో భర్తను మరో మహిళతో చూసి కన్నీరుమున్నీరైన భార్య..

సూర్యాపేట : సూర్యాపేట: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. బొడ్రాయి బజార్ సమీపంలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కిరాణా మర్చంట్స్ యజమాని చిల్లంచర్ల సోమేశ్వర్ తన షాపులో పనిచేస్తున్న ఉమతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆయన భార్య ఆరోపించింది.తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదని భార్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భర్త మరో మహిళ ఇంటికి వెళ్లాడని తెలుసుకున్న ఆమె గురువారం రాత్రి తీవ్ర ఆవేదనతో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అక్కడ భర్తను ఉమతో ఒకే గదిలో చూసిన ఆమె.. తట్టుకోలేక కన్నీరుమున్నీరైనట్లు స్థానికులు చెబుతున్నారు.ఆరు సంవత్సరాలుగా భర్తకు ఉమాతో వివాహేతర సంబంధం ఉందని, ఆమెను షాపులో యజమానిలా చూసుకుంటూ ఆరు సంవత్సరాలుగా డబ్బులు, సుమారు 20 తులాల బంగారం ఇచ్చాడని భార్య ఆరోపించింది. మరోవైపు తనను, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి వెళ్లగొట్టి తమ జీవితాలను రోడ్డున పడేశాడని ఆమె వాపోయింది.“భర్తే దిక్కనుకున్న నాకు.. ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ఎవరు దిక్కు..?” అంటూ ఆమె కన్నీరు మున్నీరైనట్లు స్థానికులు తెలిపారు. భర్తపై పెట్టుకున్న నమ్మకం కళ్లముందే కూలిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన ఆమె.. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కుటుంబ బాధ్యతలను విస్మరించి మరో మహిళ ఇంటికి వెళ్లడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రతి రోజు అతను ఆమె ఇంటికి రాత్రి పూట వచ్చేవాడని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని సోమేశ్వర్, ఉమను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది..

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో