కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష

కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్షించారు.మండలంలో తాగునీటి సమస్య పరిష్కారమైనప్పటికీ భవిష్యత్‌లో గ్రామాలు, తండాల్లో నీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్వహణ, పెండింగ్ కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లోని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ పురోగతిపై అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్, మండల ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన