శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు
పెద్ద శంకరంపేట్,: పెద్ద శంకరంపేటలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయ౦ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలతో వివిధ రకాల రంగుల వస్త్రాలను ధరించి ప్రత్యేక నృత్యాలు చేశారు.. పండగ విశిష్టతను తెలుపుతూ భారతీయ సనాతన సంస్కృతి ఉట్టిపడేలావిద్యార్థులు చేసినటువంటి కళా ప్రదర్శనలు అందరినీ అలరించాయి.. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు గొల్లభామ రాధా వేషాలతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో దాదిగారి గంగాధర్, క్రాంతి లాల్, మహంకాళి కృష్ణమూర్తి, గాండ్ల సంగమేశ్వర్,ప్రధాన ఆచాజీ లక్ష్మీనారాయణ,జయేందర్ రెడ్డి, జంగం రాఘవులు,రవి వర్మ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


