హరిదాస్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్
రాజన్న సిరిసిల్ల:ఎల్లారెడ్దిపేట్మండలం హరిదాస్‌నగర్: గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్, ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా తిప్పరవేణి భాగ్య, రొడ్డ సర్వవ్వ, గద్దల భూమరాజవ్వ, వట్టెల లక్ష్మి, జక్కుల రాణి తదితర లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్కా పరశురాములు, కాంగ్రెస్ నాయకులు వంగ మల్లారెడ్డి, రొడ్డ రామచంద్రం, ఉత్తెర్ల లక్ష్మణ్, వట్టెల రాములు, వట్టెల రవి, చీకట్ల నారాయణ, జక్కుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


