మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

ఆదిలాబాద్  : ఆదిలాబాద్ పట్టణంలోని మా లక్ష్మివాడ మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ,వార్డు కౌన్సిలర్ మీరాబాయి ప్రేమ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష  సతీష్మా ట్లాడుతూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది భక్తులు పూజా కార్యక్రమాల కోసం వస్తుంటారని, ప్రస్తుతం నాటిన మొక్కలు భవిష్యత్తులో పెద్దవిగా పెరిగి భక్తులకు చల్లని నీడను అందించడంతో పాటు ఆలయ ప్రాంగణానికి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో