కాంగ్రెస్ ను గద్దె దించడమే లక్ష్యం 

కాంగ్రెస్ ను గద్దె దించడమే లక్ష్యం 

  • కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యంపై బీఆర్ఎస్ పోరుబాట
  • గుడిహత్నూర్ నుండి ఇచ్చొడ వరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భారీ బైక్ ర్యాలీ

ఆదిలాబాద్ : కాంగ్రెస్ ను గద్దె దించడం లక్ష్యం అని బోథ్ ఏమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు గుడిహత్నూర్ కేంద్రం లో భారీ బైక్ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం హామీ, విద్యార్థులకు స్కూటీల పంపిణీ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. “1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు హామీలు తప్ప… అమలు చేసింది ఏమీ లేదు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు” అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు ఈ కార్యక్రమం లో నియోజవర్గ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో