కార్మికులకు అండ గా ఏ ఐ టి యు సి.

కార్మికులకు అండ గా ఏ ఐ టి యు సి.

  • వై. ఓమయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి.....
  • పోరాటాల తోనే సమస్యలు పరిష్కారం.....
  • సెప్టెంబర్ నెలలో జరిగే ఏఐటియుసి మహాసభల ను విజయవంతం చేయాలి......
 

బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రం లోని నాయిని బ్రాహ్మణ సేవా సంఘం లో శనివారం ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి దుబాస్ రాములు అధ్యక్షత వహించ గా ముఖ్య అతిథులు గా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓ మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న భారతదేశని కి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, ఈ దేశంలో ఉన్న కార్మికుల కు హక్కులు చట్టాలు ఉండాలని ఏఐటీయూసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బ్రిటిష్ వారి పై పోరాడి పని గంటలు పని భద్రత చట్టాల ను సాధించుకున్నామ ని భారత దేశ ప్రభుత్వం తో పోరాడి నేటి వరకున్న పీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటీ కనీస వేతనాలు తో పాటు అనేక చట్టాలను సాధించు కోవడం జరిగిందని, కానీ నేటి బిజెపి ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసిందని యజమానుల కు అను కూలంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లే కుండా సంఘం పెట్టుకు నే అధికారం లేకుండా చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తు లో కార్మిక హక్కుల రక్షణ కై చట్టాలను కాపాడు కోవడాని కి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాల కు సన్నద్ధం కావాలని ఈ నేపథ్యం లో సెప్టెంబర్ 6,7,8 తేదీలలో కరీంనగర్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఆ మహాసభల జయప్రదాని కి ఆరవ తేదీన జరిగే బహిరంగ సభలో వేలాదిమంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన కార్మిక సంఘం అధ్యక్షులు తోట శ్రీనివాస్, నాయకులు చెన్నం సురేష్, ఒల్లెపు గంగాధర్, అబ్రహం, అంజయ్య, ఎస్ రాధ, శ్రీదేవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 
482086
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,