మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఐయోడిన్‌తో పాటు అవసరమైన మందులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యం సరిగా లేక పాములు వస్తున్నాయని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే పీహెచ్‌సీని తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


