రైతులు పంట నమోదు చేసుకోవాలి మిడ్జిల్, వాడ్యాల, వేముల గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వే

మిడ్జిల్,   మిడ్జిల్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిడ్జిల్, వాడ్యాల, వేముల గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వే (డిజిటల్ పంట నమోదు) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సర్వేను ప్రైవేట్ వాలంటీర్ల ద్వారా నిర్వహిస్తున్నారు.రైతులకు చెందిన ప్రతి సర్వే నంబర్ వద్దకు వెళ్లి, అక్కడ సాగులో ఉన్న పంటతో కూడిన ఫొటోను తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో రైతులు తమ గ్రామానికి కేటాయించిన వాలంటీర్‌ను సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలని సూచించారు.డిజిటల్ పంట నమోదు ఆధారంగానే భవిష్యత్తులో పంట కొనుగోళ్లు, ప్రభుత్వ పథకాలు, పంట బీమా తదితర ప్రయోజనాలను అనుసంధానం చేసే అవకాశం ఉన్నందున, రైతులు తప్పనిసరిగా పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.

గ్రామాల వారీగా వాలంటీర్ల వివరాలు:

* మిడ్జిల్: బరిగేల కురుమయ్య – 63059 77403
* వాడ్యాల: బరిగేల సురేష్ కుమార్ – 90000 80374
* వేముల: ధదనం పల్లి చంద్రశేఖర్ – 9704199153రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పంటలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో