కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి 

మల్లూరులో బిఆర్ఎస్ భారీ ధర్నా, రాస్తారోకో

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి 

 

 

​మంగపేట, : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగపేట మండలం మల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం - బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా కారణంగా దాదాపు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాడిశ నాగరమేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వెయ్యి రోజులైనా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందన్నారు ​రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని, ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ధాన్యానికి క్వింటాల్‌కు 500 బోనస్ అన్ని రకాలకు ఇవ్వకుండా కేవలం ఐదు రకాల వెరైటీలకే పరిమితం చేశారని, మార్కెట్లో యూరియా, డిఏపి ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే నిలిపివేసేందుకు కుట్ర పన్నుతున్న రైతుభీమా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.మహిళలకు ఇస్తామన్న 2,500 మహాలక్ష్మి పథకం, 500 లకే గ్యాస్ సిలిండర్, కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాల కింద 1 లక్షతో పాటు తులం బంగారం హామీలు ఏమైనాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, జిల్లా నాయకులు కుర్బాన్ ఆలీ, పూజరి శ్రీనివాస్, కర్రి శ్యామ్ బాబు, సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు, దంతాలపల్లి నరేందర్, గాదె శ్రీను, మూగల రమేష్, అయూబ్, గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, సోయం ఈశ్వర్, రూప భద్రయ్య, పండా శ్రీను, మునిగేలా సాంబూల్, పొదెం రాంబాబు, చింతా చందర్ రావు, కొప్పుల మాణిక్యం, కొమరం పుల్లారావు, ముసలయ్య, బిఆర్ఎస్ మండల నాయకులు పబ్బోజు సత్యనారాయణ, మంచాల నాగేందర్, నిమ్మగడ్డ ప్రవీణ్, యాకన్న, సుంకోజు ప్రశాంత్, ఓదెల సుధీర్, కొమరం చంటి, మేకల పుల్లారావు, చింత గోపాల్, రఘు, చిట్టిబాబు, గోడుగు నరేష్, చంద్రకాంత్ పురుషోత్తం, గుండారపు రమేష్, మండల సంతోష్, ఇందారపు రమేష్, మునిగేలా మహేష్, దామోదర్, రాంబాబు, రెహమత్, జగన్, తొలెం బాలకృష్ణ, నజ్జుతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో