సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం.. బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు
ఎల్లారెడ్డిపేట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎన్. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.అదేవిధంగా పోలీసుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై ఎన్. రమేష్ కోరారు. ఎల్లారెడ్డిపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


