4 రోజులుగా నీళ్లు బంద్.. శివంపేట ప్రజల అవస్థలు
శివంపేట, (మెదక్): శివంపేట మండలంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్ల సమీపంలో పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు కూడా నీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టి, మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


