420 హామీలు.. 1000 రోజులు.. శివంపేటలో బీఆర్‌ఎస్ సమరభేరి!
శివంపేట, (మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శివంపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, మన్సూర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రగౌడ్, కల్లూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


