గజ్వేల్ లో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

గజ్వేల్ లో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

గజ్వేల్ / సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ప్రకటనలో తెలిపారు. తేదీ 02 సెప్టెంబర్ 2026 న ఇన్స్పెక్టర్  రవికుమార్ కి శ్రీగిరిపల్లి గ్రామ శివారులోని ఓపెన్ ప్లేస్‌లో కొంతమంది వ్యక్తులు గంజాయిని ఇతరులకు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సై మల్లారెడ్డి సిబ్బందితో కలిసి మధ్యాహ్నం సుమారు 01:00 గంటల సమయంలో పెట్రో కార్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి అక్కడ ఉన్న వారిలో ఒకరు పారిపోగా, మిగిలిన నలుగురు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల వివరాలు: టంగుటూరి శివానంద్ (తండ్రి: శంకర్, నివాసం: రామాలయం స్ట్రీట్, గజ్వేల్), దయ్యాల విజయ్ (వయస్సు: 23 సంవత్సరాలు, తండ్రి: భీమయ్య, నివాసం: ఎస్సీ కాలనీ, గజ్వేల్ టౌన్), పోతరాజు అజయ్ (వయస్సు: 20 సంవత్సరాలు, తండ్రి: మల్లేష్, నివాసం: పిడిచెడ్ గ్రామం), చిక్కుడు అనిల్ (తండ్రి: గోపాల్, నివాసం: చిక్కుడు బస్తి, గజ్వేల్ పట్టణం), పారిపోయిన వ్యక్తి వివరాలు: తేజ (నివాసం: డబుల్ బెడ్ రూమ్, గజ్వేల్ పట్టణం) పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, వీరు కొంతకాలంగా జగదేవ్‌పూర్ మండలం, మునిగడప గ్రామానికి చెందిన దేవుని నవీన్ అనే వ్యక్తి వద్ద నుంచి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గజ్వేల్ పట్టణంలోని పలువురికి విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి సుమారు 750 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో భాగస్వాములైన ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, పట్టుబడిన నలుగురిని అర్ధరాత్రి రిమాండ్‌కు తరలించారు. పారిపోయిన నిందితుడు తేజ మరియు గంజాయి సరఫరాదారు దేవుని నవీన్ ల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. చట్టవిరుద్ధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా లేదా వినియోగించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

Views: 207

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో