కాంగ్రెస్‌ హామీలపై హరీశ్‌రావు ఫైర్‌

కాంగ్రెస్‌ హామీలపై హరీశ్‌రావు ఫైర్‌

బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులతో సదస్సు నిర్వహించి, అనంతరం వంటా వార్పు చేపట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున 33 నెలలకు రూ.82,500 బకాయి పడిందని ఆరోపించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు చేయూత పింఛన్ల కింద రూ.66 వేల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రూ.500కే వంట గ్యాస్‌ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. హామీలను అమలు చేసి బకాయిలు చెల్లించకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు.

Views: 74

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో