జుక్కల్ చౌరస్తా బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి

జుక్కల్ చౌరస్తా బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
  • బస్సు డ్రైవర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

బిచ్కుంద, : జుక్కల్ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రమాదంలో మృతి చెందిన బస్సు డ్రైవర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారిని ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కామారెడ్డి నుంచి హుటాహుటిన జుక్కల్‌కు బయలుదేరారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకొని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో