పింఛన్ల దరఖాస్తులు ఈ నెల 31లోగా సమర్పించాలి: ఎంపీడీవో కె. శంకర్

పింఛన్ల దరఖాస్తులు ఈ నెల 31లోగా సమర్పించాలి: ఎంపీడీవో కె. శంకర్

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్ల కింద మొదటి దశలో అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు చౌటకూర్ మండల ఎంపీడీవో కె. శంకర్ తెలిపారు.మొదటి దశలో కింది విభాగాలకు చెందిన అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.ఒంటరి మహిళలు, వితంతువులు,దివ్యాంగులు,గీత కార్మికులు, చేనేత కార్మికులు,ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులు అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ లేదా వార్డు కార్యాలయంలో ధ్రువపత్రాలతో దరఖాస్తు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎంపీడీవో కోరారు. పంచాయతీలకు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, వివరాలను చేయూత పోర్టల్‌లో ఎలాంటి జాప్యం, తప్పులు లేకుండా నమోదు చేసేలా సర్పంచులు సహకరించాలని ఆయన కోరారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.  ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.
బాన్సువాడ లో ఆ చౌరస్తా అంటే భయం. ద్విచక్ర వాహనాని కి చాలాన్ల మోత. ఆటోమెటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేరలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్న వాహన...
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట లక్ష్మీకాంతారావు బాధ్యతల స్వీకరణ
చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎంపీ రావుల
​మల్యాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
​మల్యాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు: మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు