అచ్చంపేట డిపోలో ఘనంగా TMU ఆత్మీయ సమ్మేళనం

 ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్

అచ్చంపేట డిపోలో ఘనంగా TMU ఆత్మీయ సమ్మేళనం

అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్  ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, TMU యూనియన్ ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం అండగా ఉంటుందని అన్నారు. కార్మికుల ఐక్యతే యూనియన్ కు బలమని, ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.అచ్చంపేట డిపో అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో TMU నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో