ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి వి. పావని రైతులకు అవగాహన కల్పించారు.వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేసే రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మిగిలిన పొలంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పత్తి మరియు కంది పంటలను సందర్శించి ఎరువుల యాజమాన్యం, పిచికారి మందుల గురించి వివరించారు. ఈ వానాకాలంలో ప్రభుత్వము సూచించిన ఏడు సన్న వరి రకాలు సాగు చేసిన రైతులు బోనస్ కోసము రూ.500 విత్తనాలు కొనుగోలు చేసిన షాపులోనే తప్పనిసరిగా ఆన్లైన్లో మోదు చేసుకోవాలి. వానాకాలం పంట నమోదు కోసం సర్వేయర్లు రైతుల పొలాల వద్దకు వచ్చినప్పుడు, వారికి అవసరమైన వివరాలను అందించి పంటను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించడం జరిగింది.ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంట ఎండిపోకుండా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలని రైతులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహమ్మదాపురం సర్పంచ్ బొమ్ము సంతోష, ఉపసర్పంచ్ మారేపల్లి సైదమ్మ,గ్రామ రైతులు పాల్గొన్నారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
