మల్యాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మల్యాల, : జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్‌తో పాటు పలు పాన్ షాపులు, కిరాణా దుకాణాలలో సోమవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఐ, ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో డాగ్ స్క్వాడ్‌తో ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల ముసుగులో ఎవరైనా నిషేధిత గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా లేదా నిల్వ ఉంచినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా అక్రమ మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


