పోతుగంటి భరత్ ప్రసాద్ ఆధ్వర్యంలో గద్వాలలో బీజేవైఎం భారీ ర్యాలీ
నాగర్ కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో *"ఫీజుల బకాయి - బీజేపీ లడాయి"* కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి *భరత్ ప్రసాద్* హాజరై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, దీని వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
