బల్మూర్ లో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
అచ్చంపేట నియోజకవర్గంలో మూడు HAM రోడ్లకు శ్రీకారం
నాగర్ కర్నూలు : జిల్లా బల్మూర్ మండలంలో రూ.146.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన రహదారి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట ఫేజ్-1 లో భాగంగా ఈ రహదారి పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు.
మూడు రహదారి పనుల వివరాలు:
1. అమ్రాబాద్ - తొల్పలపల్లి రహదారి: రూ.32.99 కోట్లతో పదర, వాంకేశ్వరం, చిట్లముకుంట, ఉడిమిల్ల, ఇప్పలపల్లి మీదుగా 34.20 కి.మీ మేర రహదారిని బలోపేతం చేయనున్నారు.
2. బల్మూర్ - నాగర్ కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారి:* రూ.35.71 కోట్లతో బల్మూర్, గోడల్, తుమ్మన్ పేట మీదుగా వెళ్లే రహదారిని రెండు లేన్లుగా విస్తరించనున్నారు.
3. అచ్చంపేట - రాకొండ రహదారి:* రూ.78.01 కోట్లతో ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి మీదుగా రాకొండ వరకు రెండు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు.
ఈ మూడు రహదారి పనులు పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
