420 హామీలు 13 డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
మంచిర్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ పుష్కూరి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ మంచిర్యాల వినతి పత్రం అందించారు ప్రభుత్వ వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారెంటీలు 420 హామీలు 13 డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పేసి లేనియెడల ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేస్తూ. ఎన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇండ్లను 22ఏ నిషేధిత జాబితా కింద ఉంచడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని అన్నారు అలాగే నిషేధిత జాబితా 22ఏ కింద ఉన్న ఇండ్లను వెంటనే రద్దు చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలియజేసారుఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, శిశు సంక్షేమ శాఖ మాజీ జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల శంకర్ ,మాధవరపు రామారావు,మొహమ్మద్ తాజుద్దీన్, గంగులు, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అజీమ్ హరీష్ పటేల్,ఉమా, మహేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


